'సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'
W.G: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ ఎస్పీ వీ. భీమారావు సూచించారు. ఆకివీడులో ఆయన మాట్లాడుతూ.. డిజిటల్ అరెస్టుల పేరుతో నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇలాంటి ఘటనల్లో బాధితులు వెంటనే 1930కి కాల్ చేస్తే ఖాతాల లావాదేవీలు నిలిపివేస్తామని చెప్పారు. అనుమానాస్పద కాల్స్‌కు స్పందించవద్దని ఎస్పీ హెచ్చరించారు.