విద్యుత్ షాక్‌తో రైతు మృతి

PLD: శావల్యాపురం మండలం పిచికలపాలెం గ్రామంలో రామ సుబ్బారావు (60) బుధవారం ఉదయం విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. వరి నారుకు నీరు పెట్టేందుకు పొలానికి వెళ్లి ట్రాన్స్ ఫార్మర్ వద్ద కరెంటు తీగ ఊడి సప్లై కాకపోవడంతో, ట్రాన్స్ ఫార్మర్ వద్ద ఉన్న తీగను చుట్టే ప్రయత్నం చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మరణించాడు.