VIDEO: అగ్నిప్రమాదం.. 5 లక్షల ఆస్తి నష్టం
BPT: కర్లపాలెం మండలం పెదపులుగువారిపాలెంలో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో స్థానికురాలు పులుగు సులోచన పూరి గుడిసె పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంట్లో దాచిన రొయ్యల చెరువుల డబ్బులు, బంగారం కాలి బూడిదయ్యాయి. సుమారు రూ.5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. కట్టుబట్టలతో మిగిలామని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.