ఉయ్యురు పోలీసుల సమయస్ఫూర్తికి అభినందనలు
కృష్ణా: ఉయ్యూరు బడే సాహెబ్ చెరువు రోడ్డులో తప్పిపోయి, ఎటు వెళ్లాలో తెలియక అరుగుపై కూర్చున్న ఆకుల సూర్యనారాయణ అనే వృద్ధుడిని స్థానికులు గుర్తించారు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలియగానే ఉయ్యూరు పోలీసులు తక్షణమే స్పందించారు. అక్కడికి చేరుకొని వివరాలు సేకరించి, కుటుంబ సభ్యులను సంప్రదించి, ఆయనను సురక్షితంగా వారికి అప్పగించారు. పోలీసుల సమయస్ఫూర్తిని పలువురు అభినందించారు.