మహిళా పారిశుధ్య కార్మికులకు చీరలు పంపిణీ
SRCL: వేములవాడ మున్సిపల్ శాత్రాజ్పల్లిలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 2వ వార్డు కౌన్సిలర్ ఏనుగు జ్యోతి ఆధ్వర్యంలో మున్సిపల్ మహిళా పారిశుధ్య కార్మికులను శాలువాలతో ఘనంగా సన్మానించి, వారి సేవలను కొనియాడారు. అనంతరం వారికి ప్రత్యేక బహుమతులుగా చీరలను అందజేసి అభినందించారు.