పైపులైన్ మరమ్మతులు.. గొయ్యిలతో ఇబ్బందులు

పైపులైన్ మరమ్మతులు.. గొయ్యిలతో ఇబ్బందులు

SKLM: లక్ష్మీ నర్సుపేట గ్రామానికి ఉన్న రహదారిలో త్రాగునీటి పైపులైన్ మరమ్మతుల్లో గొయ్యి తీసి పూడ్చి విడిచి పెట్టడంతో ప్రయాణికులు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామం లోని మెగా మంచి నీటి పథకం ద్వారా మండల ప్రజలకు త్రాగునీరు సరఫరా చేస్తున్నారు. నీరు సరఫరా ఆటంకం ఏర్పడినపుడు రహదారిపై గొయ్యి తీసి మరమ్మతులు చేస్తున్నారు.