పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
W.G. భీమవరం పట్టణంలోని పీ.ఎస్.ఎం బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షల కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణను పరిశీలించి, హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి వసతి, మెడికల్ క్యాంపు, సిట్టింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఆమె వెంటే డీఈవో నారాయణ పాల్గొన్నారు.