మంగళవారం: నేటి తిరుమల సమాచారం
TPT: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 20 కంపార్టు మెంట్లలో భక్తులు వేచివున్నారు. నిన్న 70,044 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 27,241 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం సుమారు రూ. 5.08 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.