శంకరంబాడి సుందరాచార్యులకు ఘన నివాళి

శంకరంబాడి సుందరాచార్యులకు ఘన నివాళి

TPT: శంకరంబాడి సుందరాచార్యుల వర్థంతి సందర్భంగా ప్రముఖులు తిరుపతిలో ఇవాళ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 'మా తెలుగు తల్లికి మల్లెపూదండ' గేయంతో తెలుగువారి కీర్తిని చాటిన మహనీయుడిని అభిమానులు స్మరించుకున్నారు. తెలుగు భాషా సాహిత్యాలకు ఆయన చేసిన సేవలను, ముఖ్యంగా రాష్ట్ర గీతం ద్వారా తెలుగువారి గుండెల్లో ఆయన సంపాదించుకున్న స్థానాన్ని ఈ సందర్భంగా కొనియాడారు.