వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఛైర్మన్

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఛైర్మన్

JGL: మెట్‌పల్లి మండలం ఆత్మకూర్ గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కూన గోవర్ధన్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సన్న వడ్లకు బోనస్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.