రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
MBNR: భూత్పూర్ మండలం దివిటిపల్లి శివారులో మంగళవారం సాయంత్రం ఓ రైలు నుంచి ప్రమాదవశాత్తు పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే ఎస్సై ఏ. రాజు ఒక ప్రకటనలో వెల్లడించారు. మృతుడి వయస్సు సుమారు 25 సంవత్సరాలు ఉంటుందన్నారు. ఎవరైనా మృతుడిని గుర్తిస్తే 871265 8597కు సంప్రదించాలన్నారు.