ఫోర్జరీ పత్రాలతో చీటింగ్.. నిందితులు అరెస్ట్

ఫోర్జరీ పత్రాలతో చీటింగ్.. నిందితులు అరెస్ట్

KDP: బద్వేలులో ఫోర్జరీ పత్రాలతో మోసం చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. విదేశాల్లో ఉన్న యజమాని ఆస్తికి సంబంధించిన అసలు పత్రాలు దొంగిలించి, నకిలీ సంతకాలతో సేల్ అగ్రిమెంట్లు తయారు చేసి ప్లాటును అక్రమంగా విక్రయించినట్లు పోలీసులు వెల్లడించారు. రూ.12 లక్షల వరకు మోసం చేసిన నిందితులను శుక్రవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించింది.