అమరావతికి చట్టబద్ధత.. గెజిట్ విడుదల
AP: రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సబ్ సెక్షన్-2లో రాజధాని అమరావతిగా పార్లమెంట్ ఆమోదించిన బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేశారు. దీంతో 2024 జూన్ 2 నుంచి అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా అమల్లోకి వచ్చింది. ఈ చారిత్రక నిర్ణయంతో రాజధానిపై గత పదేళ్లుగా నెలకొన్న అనిశ్చితికి శాశ్వతంగా తెరపడింది.