VIDEO: అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి

SKLM: సంతబొమ్మాళి మండలం వడ్డివాడ క్రాసింగ్ వద్ద ఇరిగేషన్ శాఖ పరిధిలో రూ. 35 లక్షలతో నిర్మించిన వంశధార పనులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదివారం ప్రారంభించారు. అనంతరం గరిబులు గెడ్డ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన షట్టర్‌ను ఓపెన్ చేసి నీరు విడుదల చేశారు. దీంతో 1,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందని మంత్రి అన్నారు. అనంతరం గట్టుపై నిర్మించిన గ్రావెల్ రహదారి ప్రారంభించారు.