సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే
VZM: సీఎం సహాయనిధి పేదలకు ఆపద్బాంధవుడిగా, మధ్యతరగతి కుటుంబాలకు ఒక వరంలా ఉంటుందని ఎస్. కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. ఆదివారం ఎల్. కోట టీడీపీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సీఎం సహాయనిధి అర్హులందరికీ వెలుగు నింపడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.