మురళీ నాయక్‌కు నివాళులర్పించిన లోకేష్

మురళీ నాయక్‌కు నివాళులర్పించిన లోకేష్

AP: యుద్ధభూమిలో వీరమరణం పొందిన మురళీ నాయక్ అంత్యక్రియల్లో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా కల్లితండాలో మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి వీరజవాన్ మురళీ భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం జవాన్ కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.