విరోష్ జంట దావత్.. నెటిజన్లు ఫైర్
TG: నాగర్ కర్నూల్ జిల్లా తుమ్మన్ పేటలో విజయ్ దేవరకొండ, రష్మిక ఇవాళ సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన విషయం తెలిసిందే. అక్కడికి వచ్చిన అతిథులు, అభిమానులకు గ్రాండ్‌గా నాన్ వెజ్ దావత్ ఇచ్చారు. అయితే దీనిపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి. సత్యనారాయణ స్వామి వ్రతం రోజు నాన్ వెజ్ పెట్టడం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు తప్పేంటని సమర్థిస్తున్నారు. మరి మీరేమంటారు.?