ప్రజలకు మంచి చేయడంలో ముందుంటాం

VZM: చీపురుపల్లిలోని హడ్కో కాలనీలో ప్రజల సౌకర్యార్థం రూ.2లక్షల ఎంపీపీ నిధులుతో తాగునీటి బోరు రిగ్గింగ్ పనులను ఎంపీపీ ఇప్పిలి వెంకటనర్సమ్మ, సర్పంచ్ సుధారాణి సోమవారం భూమి పూజ చేసి ప్రారంభించారు. ప్రజలకు మంచి చేసేందుకు తామెప్పుడూ ముందు వరుసలోనే ఉంటామని ఎంపీపీ ఈ సందర్బంగా తెలిపారు. ప్రాధాన్యత క్రమంగా అవకాశం ఉన్నంత మేర మంచి చేస్తున్నామని చెప్పారు.