కోవెలకుంట్లలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

కోవెలకుంట్లలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

NDL: యువకుల ప్రాణాలను హరించే క్రికెట్ బెట్టింగ్‌పై ఉక్కుపాదం మోపుతున్నట్లు ఆళ్లగడ్డ డీఎస్పీ కే. ప్రమోద్ పేర్కొన్నారు. శనివారం కోవెలకుంట్లలో అదుపులోకి తీసుకున్న క్రికెట్ బెట్టింగ్ ముఠాసభ్యులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. సీఐ హనుమంతు నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు ఆరుగురు క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకుని రూ. 4 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నట్ల వెల్లడించారు.