ధర్మస్థల వ్యవహారంలో మరో మలుపు

కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థలి ఘటన కొత్త మలుపు తిరిగింది. బెంగళూరుకు చెందిన మహిళ తాను గతంలో చెప్పినవన్నీ కట్టుకథలని స్పష్టం చేసింది. 2003లో తన కుమార్తె అదృశ్యమైందని తాను చెప్పినవన్నీ అబద్ధాలని ఆమె పేర్కొంది. ఈ కేసులోని ఇద్దరు ప్రముఖ వ్యక్తులు తనతో అలా చెప్పించారని ఆమె వెల్లడించింది. అంతేకాక, తనకు అనన్యభట్ అనే కూతురు లేదని కూడా క్లారిటీ ఇచ్చింది.