తాటి చెట్టు పై నుంచి పడి గీత కార్మికుడు మృతి

తాటి చెట్టు పై నుంచి పడి గీత కార్మికుడు మృతి

HNK: హాసన్ పర్తి మండలం మడిపల్లి గ్రామానికి చెందిన బుర్ర కుమారస్వామి(50) అనే గీత కార్మికుడు తాటి చెట్టు పై నుంచి పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. కల్లు తీయడం కోసం తాటి చెట్టు ఎక్కి కాలు జారి కింద పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.