వాహనం ఢీకొని గొర్రెలు మృతి

వాహనం ఢీకొని గొర్రెలు మృతి

PLD: కారు ఢీకొని గొర్రెల మృతి చెందిన ఘటన రొంపిచర్ల(మ) సంతగుడిపాడు గ్రామం వద్ద గురువారం చోటుచేసుకుంది. అద్దంకి నార్కెట్ పల్లి హైవేపై సంతగుడిపాడు సత్సంగం సమీపంలో ఒంగోలు వైపు వెళుతున్న ఓ కారు గ్రామం నుంచి పొలం వెళుతున్న గొర్రెలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. సమాచారం అందుకున్న రొంపిచర్ల ఎస్సై మణికృష్ణ సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.