రంగాతో అంబటికి పోలికా..?
VSP: వంగవీటి రంగా వంటి మహానేతతో అంబటి రాంబాబును పోల్చడం సిగ్గుచేటని వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్ మండిపడ్డారు. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ, రాజకీయ ప్రయోజనాల కోసం రంగా పేరును వాడటం తగదని స్పష్టం చేశారు. విశాఖలో ఆయన మంగళవారం మాట్లాడుతూ.. వైసీపీ రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తోందని మండిపడ్డారు.