రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

కడప శివారులో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో చెన్నూరుకు చెందిన సూరి అనే యువకుడు మృతి చెందారు. బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.