అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించిన DEO
KDP: ప్రొద్దుటూరు వసంతపేట పురపాలక ఉన్నత పాఠశాలలో శుక్రవారం12 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వీరంతా పొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థులను DEO శంషుద్దీన్ పరామర్శించి వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. ఆస్పత్రి వైద్యులతో DEO మాట్లాడి విద్యార్థుల పరిస్థితి అడిగి తెలుసుకున్నారు