పంజాబ్ జోరు.. 11 ఏళ్లలో తొలిసారి!

శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ దూసుకుపోతోంది. ఈ సీజన్‌లో ఆడిన 11 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో 15 పాయింట్లు సాధించి.. రెండో స్థానంలో నిలిచింది. అయితే, 2014 సీజన్ తర్వాత తొలిసారి ఈ సీజన్‌లోనే 15 పాయింట్లు సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణిస్తూ విజయాలు సాధిస్తోంది. ఇదే ఊపును కొనసాగిస్తే తొలిసారి IPL విజేతలుగా నిలిచే అవకాశం ఉంది.