VIDEO: వైరాలో ప్రశాంతంగా పోలింగ్.. పర్యవేక్షించిన: ACP
KMM: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైరాలో పోలింగ్ ప్రక్రియ బుధవారం ఉదయం ప్రశాంతంగా సాగింది. ఏసీపీ సారంగపాణి క్షేత్రస్థాయిలో పర్యటించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. కేంద్రాల వద్ద జనాలు గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఓటర్లకు ఇబ్బంది కలగకుండా అధికారులు వసతులు కల్పించారు.