ఎస్.రాయవరంలో ముమ్మరంగా పారిశుధ్య పనులు
AKP: తుఫాన్ ప్రభావంతో నాలుగు రోజులపాటు వర్షాలు కురిసిన నేపాధ్యంలో ఎస్.రాయవరం మండలం ధర్మవరం గ్రామంలో ముమ్మరంగా పారిశుద్ధ పనులు చేపట్టారు. శనివారం పనులను పర్యవేక్షించిన డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ మాట్లాడుతూ.. మండలంలో అన్ని గ్రామాల్లోనూ పారిశుధ్యం పరిశుభ్రతపై దృష్టి సారించినట్లు తెలిపారు. మంచినీటి ట్యాంకుల్లో క్లోరినేషన్ చేస్తున్నామన్నారు.