రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన మాక్స్‌వెల్
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ తన రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలకు తెరదించాడు. మెల్‌బోర్న్‌లో మీడియాతో మాట్లాడిన మాక్స్.. ప్రస్తుతానికి రిటైర్మెంట్ ప్రకటించే ఉద్దేశం లేదని స్పష్టం చేశాడు. తన శరీరం సహకరిస్తే 2028 ఒలింపిక్స్, తదుపరి టీ20 ప్రపంచకప్‌లో ఆడాలని ఉందనే ఆకాంక్షను వ్యక్తం చేశాడు.