గ్రంథాలయాన్ని తనిఖీ చేసిన కార్యదర్శి

గ్రంథాలయాన్ని తనిఖీ చేసిన కార్యదర్శి

AKP: రాంబిల్లి మండలం దిమిలి గ్రంథాలయాన్ని ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంధాలయ కార్యదర్శి బీ.కుమార్ రాజా శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి, గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న పుస్తకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయ అధికారులు సమయపాలన పాటించాలని చూచించారు. నిరుద్యోగులు, ఉపాధ్యాయులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.