గోసులకురప్పల్లిలో ఉచిత వైద్య శిబిరం

గోసులకురప్పల్లిలో ఉచిత వైద్య శిబిరం

CTR: చౌడేపల్లి మండలం గోసులకురప్పల్లిలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. CMC వేలూరు ఆసుపత్రి వారు గ్రామంలో పర్యటించి సర్వే చేశారు. అసంక్రమిత వ్యాధులపై  ఆరా తీశారు. అధిక రక్తపోటు, చక్కెర వ్యాధి ఉన్న వ్యాధిగ్రస్తులకు పరీక్షలు నిర్వహించారు. అలాగే సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పవన్ కుమార్, CMC సిబ్బంది పాల్గొన్నారు.