కేంద్ర ప్రభుత్వానికి గిగ్ వర్కర్లు విజ్ఞప్తి
LPG, CNG కొరతపై దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ బంకుల దగ్గర వాహనాలు బారులు తీరవడంతో ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే.. హోటళ్లు, రెస్టారెంట్లపైనా LPG కొరత ప్రభావం పడింది. దీంతో స్విగ్గీ, జొమాటో డెలివరీలకు సమస్యలు తలెత్తాయి. వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి గిగ్ వర్కర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.