త్వరలో నూతన గ్రంథాలయ భవనం
CTR: 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను కుప్పం గ్రంథాలయంలో శుక్రవారం నిర్వహించారు. విద్యా బాండాగారంగా గ్రంథాలయాలను విద్యార్థులు ఉపయోగించుకుని విజ్ఞానం పొందాలని MLC శ్రీకాంత్ సూచించారు. ఇందులో భాగంగా CM చంద్రబాబు ఆధునిక గ్రంథాలయ నిర్మాణానికి ప్రతిపాదన సిద్ధం చేయడం జరిగిందన్నారు. అనంతరం అనువైన స్థలంలో నూతన గ్రంథాలయ భవనం త్వరలో నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.