మొదలైన కౌంటింగ్.. ఉత్కంఠలో అభ్యర్థులు..!
SRPT: మున్సిపల్ పోరులో క్లైమాక్స్ మొదలైంది. పట్టణంలోని SV ఇంజినీరింగ్ కళాశాలలో ఇవాళ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రక్రియ అట్టహాసంగా ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన అధికారులు, అనంతరం వార్డుల వారీగా బాక్సులను తెరుస్తున్నారు. కేంద్రం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గెలుపుపై ప్రధాన పార్టీల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.