బూర్గంపహడ్ బ్రిడ్జి వద్ద ఆటో ప్రమాదం
BDK: బూర్గంపహడ్ బ్రిడ్జి సమీపంలో రెండు ఆటోలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఢీకొన్న ధాటికి రెండు ఆటోలు రోడ్డుపక్కన ఉన్న లోయలోకి దూసుకెళ్లాయి. ఈ ఘటనలో ప్రయాణికులు స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.