VIDEO: తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ధర్నా

MNCL: అకాల వర్షానికి తడిసిన వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ చెన్నూరు మండలం కిష్టంపేట ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి బుధవారం ధర్నా చేపట్టారు. ఎలాంటి తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు రైతులను వారించే ప్రయత్నం చేశారు. దీంతో కొద్దిసేపు రైతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.