సీపీఐ(ఎం) నగర కమిటీ విస్తృతస్థాయి సమావేశం

NZB: CPI(M)నగర కమిటీ ఆధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశం నేడు నగరంలోని CPI(M) కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా బాధ్యులు బుర్రి ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి చేయాలని ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తానని ఇచ్చిన హామీ నెరవేర్చాలని అన్నారు.