అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం కీలక సూచనలు

అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం కీలక సూచనలు

కేరళలో అయ్యప్ప స్వామి దర్శనాల వేళ బ్రెయిన్‌ ఫీవర్‌ కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. పంబలో స్నానాలు చేసే వేళ జాగ్రత్తగా ఉండాలని, ముక్కులోకి నీరు వెళ్లకుండా చూసుకోవాలని పేర్కొంది. బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబా మెదడులోకి చేరుతుందని వైద్య నిపుణుల హెచ్చరిక మేరకు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.