VIDEO: చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
HNK: హనుమకొండ, కాజీపేటలకు చెందిన మొత్తం 226 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను, 176 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, మేయర్ సుధారాణి పంపిణీ చేశారు. గత పాలనలో ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, అర్జీలు కూడా పట్టించుకునే పరిస్థితి లేకపోయిందని విమర్శించారు.