రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

AKP: అనకాపల్లి హైవేపై శనివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ గాయపడ్డాడు. తుని నుంచి విశాఖకు సిలెండర్ల లోడుతో వెళ్తున్న వ్యాన్ ఉపమాక హైవే జంక్షన్ వద్ద ఆగిన లారీని ఢీకొట్టింది. కొవ్వూరుకు చెందిన వ్యాన్ డ్రైవర్ సీహెచ్ కృష్ణ కేబిన్‌లో చిక్కుకుపోయాడు. చోదకుడికి తీవ్ర గాయాలు కాగా పోలీస్ సిబ్బంది అతన్ని బయటకు తీసి ఆస్పుత్రికి తరలించారు.