ఆర్టీసీ ప్రయాణికులకు గమనిక
NZB: ఆర్మూర్ RTC డిపో నుంచి ప్రజల సౌకర్యార్థం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రాజధాని ఏసీ బస్సులను నడుపుతున్నట్లు ఇవాళ డిపో మేనేజర్ రవికుమార్ తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని వింజమూరు, నిగిరి,పామూరు,మార్కాపురం, ఉదయగిరి ప్రాంతాలకు సూపర్ లగ్జరీ బస్సులు నడుపుతున్నామన్నారు. ఈ అవకాశాన్ని ఆర్మూర్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.