ఎరువుల షాపుల తనిఖీలు

ఎరువుల షాపుల తనిఖీలు

అనకాపల్లి: పాయకరావుపేట పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో గల ప్రైవేట్ ఎరువుల షాపులను తనిఖీ చేస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి ఆదినారాయణ గురువారం తెలిపారు. అక్రమంగా ఎరువులు నిల్వ చేసినా అధిక ధరలకు విక్రయించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. మండలంలో ఎరువుల కొరత లేదని స్పష్టం చేశారు. అవసరమైన రైతులకు ఎరువులను పంపిణీ చేస్తున్నామన్నారు.