జిల్లా కలెక్టర్‌ను కలిసిన ఎరిక్షన్ బాబు
మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్ విజయ సునీతను కలెక్టరేట్‌లోని ఆమె ఛాంబర్‌లో ఎర్రగొండపాలెం టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ఎదుర్కొంటున్న పలు సమస్యలు, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల గురించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.