రైతులకు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో విజ్ఞాన యాత్ర
ప్రకాశం: గిద్దలూరు మండల రైతులకు అధిక దిగుబడి, నాణ్యమైన ఉత్పత్తి సాధనపై అవగాహన కల్పించేందుకు జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో గురువారం విజ్ఞాన యాత్ర నిర్వహించారు. రైతులను మార్టూరు మండలం బొబ్బేపల్లి గ్రామంలోని షేడ్నెట్, పాలీహౌస్లకు తీసుకెళ్లి టమోటా, క్యాప్సికం కూరగాయలు, చామంతి పూల సాగు విధానాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారి శ్వేత పాల్గొన్నారు.