హెల్మెట్ ధరించడంపై అవగాహన సదస్సు

హెల్మెట్ ధరించడంపై అవగాహన సదస్సు

కృష్ణా: నందిగామ పట్టణ ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ ధరించడంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్సై బాలచంద్రుడు మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల్లో మరణాలకు హెల్మెట్ ధరించకపోవడమే ప్రధాన కారణమని, నిర్లక్ష్యం ప్రాణాలకు ముప్పు తెస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో, హెల్మెట్ ధరిస్తేనే ప్రవేశం తప్పనిసరి చేస్తూ, నందిగామలో పలుచోట్ల అవగాహన కల్పించారు. ప్రజలందరూ సహకరించాలని కోరారు.