టీడీపీ నేత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే పరామర్శ
W.G: అత్తిలి మండలం టీడీపీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత ఆనాల ఆదినారాయణ కుటుంబ సభ్యులను ఇవాళ ఎమ్మెల్యే రాధాకృష్ణ పరామర్శించారు. ఆదినారాయణ కుమారుడు అభిరామ్ ఇటీవల ఆకస్మికంగా మృతి చెందడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎమ్మెల్యే వెంట పలువురు కూటమి నాయకులు ఉన్నారు.