ఈ నెల 21న రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలు
NDL: పాణ్యం మండలం కొత్తూరులో ఉగాది పండుగను పురస్కరించుకుని ఈ నెల 21న రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఇవాళ తెలిపారు. గెలుపొందిన ఎద్దుల యజమానులకు వరసగా మొదటి బహుమతి రూ.లక్ష, రెండో బహుమతి రూ.80 వేలు, మూడో బహుమతి రూ.60 వేలు, నాలుగో బహుమతి రూ.40 వేలు, ఐదో బహుమతి రూ.20 వేలు నగదు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.