VIDEO: నల్లమల్లలో కనువిందు చేస్తున్న వాటర్ ఫాల్స్

NGKL: అమ్రాబాద్ మండలంలోని నల్లమల అడవి ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు మన్నెవారిపల్లి SLBC టన్నెల్‌పై భాగంలో ఉన్న భైరోని చెర్ల వాటర్ ఫాల్స్ కనువిందు చేస్తున్నాయి. దాదాపు 500 మీటర్ల ఎత్తు కొండపై నుంచి కిందకు పడుతున్న జలపాతం అందాలు స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ వాటర్ ఫాల్స్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు.