కూలిన ఇళ్లను పరిశీలించిన తహసీల్దార్

NZB: కోటగిరిలో వారం రోజులుగా కురిసిన వర్షాలకు కూలిపోయిన ఇళ్లను తహసీల్దార్ గంగాధర్ కాంబ్లే, కాంగ్రెస్ నాయకుడు బర్ల మధుతో కలిసి మంగళవారం పరిశీలించారు. వర్షాలకు దెబ్బతిన్న ఇళ్ల నివేదికలను తయారు చేసి ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు. బాధితులను ప్రభుత్వ పరంగా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నేత బర్ల మధు పాల్గొన్నారు.