బేకరీలో చెలరేగిన మంటలు

వికారాబాద్: తాండూర్ పట్టణంలోని సమద్ ఫంక్షన్‌హాల్ సమీపంలో ఉన్న కేక్ వరల్డ్ బేకరీలో బుధవారం సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు మాట్లాడుతూ.. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని అన్నారు. బేకరీలోని డీఫ్రిడ్జ్ తదితర సామగ్రి దగ్ధమైనట్టు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బందికి సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.